Animal Movie : వంగా యానిమ‌ల్ సెన్సేష‌న్

వ‌సూళ్లలో మూవీ సునామీ

Animal Movie : టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌న సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ స‌క్సెస్ అందుకున్నాడు హీరో ర‌ణ‌బీర్ క‌పూర్, హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా. తండ్రీ, కొడుకుల మ‌ధ్య అనుబంధం , భావోద్వేగాల‌ను తెర‌పై ఆక‌ట్టుకునేలా తీయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు డైరెక్ట‌ర్.

Animal Movie Sensation

డిసెంబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే ఏకంగా ఇండియాలో రూ. 60 కోట్లు సాధించ‌డం విశేషం. మొత్తంగా ఓవ‌ర్సీస్ తో క‌లుపుకుంటే రూ. 100 కోట్లు వ‌సూలు చేయ‌డం సంతోషాన్ని క‌లిగించింది.

ఇదిలా ఉండ‌గా సినీ క్రిటిక్స్ ప్ర‌కారం చూస్తే ర‌ణ‌బీర్ కెరీర్ లోనే అత్య‌ధికంగా క‌లెక్ష‌న్లు సాధించింది. విచిత్రం ఏమిటంటే ద‌క్షిణాదిన కూడా యానిమ‌ల్ చిత్రాన్ని(Animal Movie) భారీ ఎత్తున ఆద‌రిస్తున్నారు. ప్ర‌త్యేకించి ఎక్కువ‌గా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి.

విల‌న్ గా బాబీ డియోల్ న‌ట‌న‌కు ఫ్యాన్స్ జేజేలు ప‌లుకుతున్నారు. రాబోయే రోజుల్లో రూ. 1000 కోట్లు వ‌సూలు చేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేద‌ని సినీ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మొత్తంగా వంగా సందీప్ రెడ్డి త‌న స‌త్తా ఏమిటో చాటాడు. తెలుగు వాడి ద‌మ్ము ఏమిటో చూపించాడ‌ని టాలీవుడ్ రంగానికి చెందిన
సినీ ప్ర‌ముఖులు చెప్ప‌డం విశేషం.

Also Read : Rahul Gandhi Viral : రాహుల్ గాంధీ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!