Rahul Gandhi Viral : రాహుల్ గాంధీ వైర‌ల్

ఇండియా కూట‌మిలో కీల‌కం

Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సెన్సేష‌న్ గా మారారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. మిజోరం, మ‌ధ్య ప్ర‌దేశ్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ , తెలంగాణ‌, రాజ‌స్థాన్ కు సంబంధించి డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు ప్ర‌క‌టించనున్నాయి. కాగా నాలుగు రాష్ట్రాల‌లో ఆదివారం లెక్కించ‌నున్నారు. ఇక మిజోరం రాష్ట్రంలో మాత్రం సోమ‌వారం ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

Rahul Gandhi Viral with his Hardwork

ఈసారి ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు రాహుల్ గాంధీ. స్టార్ క్యాంపెయినర్ గా ముందున్నారు. ఆయ‌న‌తో పాటు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌చారంలో ముందుండి నిర్వ‌హించారు.

దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ అయ్యింది. దీనికి ప్ర‌ధాన వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించింది యోగేంద్ర యాద‌వ్.

తెలంగాణ‌లో కాలికి బ‌ల‌పం పెట్టుకుని తిరిగారు రాహుల్ గాంధీ. ఆయ‌న ముందుండి జోష్ పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ప‌లు స‌భ‌లు, రోడ్ షోలలో పాల్గొన్నారు . రేవంత్ రెడ్డి దూకుడు సునీల్ క‌నుగోలు వ్యూహం కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి రాబోతోంద‌ని ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించాయి.

Also Read : Revanth Reddy : కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్ అమెరికాకు

Leave A Reply

Your Email Id will not be published!