Pakistan Team Shame : పాకిస్తాన్ జట్టుకు అవమానం
ఆస్ట్రేలియా టూర్ లో బిగ్ షాక్
Pakistan Team : సిడ్నీ – పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోరమైన అవమానం జరిగింది. ప్రస్తుతం ఆ టీమ్ ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇదిలా ఉండగా ఆడేందుకు గాను పాకిస్తాన్ నుంచి సిడ్నీకి చేరుకుంది. ఇదిలా ఉండగా ఏ జట్టు అయినా ఇతర దేశాల టూర్ కు వెళ్లిన సమయంలో ఆ దేశానికి సంబంధించిన క్రికెట్ బోర్డుతో పాటు, ఆడే జట్టుకు చెందిన రాయబార కార్యాలయం నుంచి రాయబారి లేదా ఇతర ఉన్నతాధికారి ఆహ్వానం పలకడం ఆనవాయితీగా వస్తోంది. ఇది తప్పకుండా పాటించాల్సిన రూల్. దీనిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) స్పష్టం చేసింది.
Pakistan Team Shame Viral
విచిత్రం ఏమిటంటే భారత దేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆశించిన మేర ఆకట్టు కోలేక పోయింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇంటి బాట పట్టింది. పాకిస్తాన్ లో క్రికెటర్లకు సరైన ఆదరణ లభించ లేదు.
ఇదే సమయంలో ఆస్ట్రేలియాతో ఆడేందుకు వెళ్లిన పాకిస్తాన్ టీమ్ కు ఆహ్వానం పలకక పోవడం , ఘోరంగా అవమానించడమేనని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ఆహ్వానించ లేదు. సంస్థ తరపున ఏ ఆఫీసర్ రాలేదు.
దీంతో గత్యంతరం లేక పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు తమ లగేజీని ట్రక్కులో ఎక్కించు కోవాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
Also Read : Sanju Samson : ఎట్టకేలకు శాంసన్ కు ఛాన్స్