Ram Gopal Varma : కాబోయే సీఎం రేవంత్ – ఆర్జీవీ
షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్
Ram Gopal Varma : హైదరాబాద్ – ప్రముఖ సినీ, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయాన్ని కట్ట బెట్టడం ఆనందంగా ఉందన్నారు.
Ram Gopal Varma Praises Revanth Reddy
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీని , ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ప్రత్యేకించి తెలంగాణ ఇచ్చిన సోనియాను ప్రజలు ఇంకా మరిచి పోలేదని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వల్లనే ఆదరణ లభించిందని, ఇది ప్రజలు తమ వైపు తిప్పుకునేలా ఇచ్చారని స్పష్టం చేశారు ఆర్జీవీ. అయితే ఎంతో కష్ట పడిన రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అవుతారంటూ జోష్యం చెప్పారు దర్శకుడు.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో , జనం తీర్పు ఎలా ఉంటుందో ఈ ఎన్నికలు చాటి చెప్పాయని ఇది ఒక పాఠంగా ఉపయోగ పడుతుందని తెలిపారు .
Also Read : Minister KTR : ఫలితాల పట్ల బాధ లేదు – కేటీఆర్