Revanth Reddy : ప్రజా పాలనకే ప్రయారిటీ – రేవంత్
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy). తాము చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీలను ఆరు నూరైనా సరే అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఏడో హామీగా ప్రజాస్వామ్య బద్దమైన పాలన అందిస్తామని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Comment
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి తీసుకు వచ్చేలా చేసినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు . ఈ విజయం తమ పార్టీది కాదని నాలుగున్నర కోట్ల ప్రజలది అని కొనియాడారు. అంతే కాకుండా 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని తిరిగి తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రాజీ పడబోమంటూ ప్రజలకు మరోసారి మాట ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలను కూడా సమన్వయం చేసుకుని అభివృద్దిలో రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ లో నిలిపేలా చేస్తానని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్.
ఈ గెలుపు ప్రజలతో పాటు అమరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : CM KCR Loss : దొరను బతికించిన గజ్వేల్