Congress CM : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్(Congress) తో పాటు తన మిత్రపక్షంతో కలిపి 64 సీట్లను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు జనం.
Congress CM Viral
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఇది పక్కన పెడితే ఇవాళ సీఎల్పీ సమావేశం కానుంది. ఎవరు సీఎం అవుతారనే దానిపై తెలంగాణ సమాజం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.
ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు సీనియర్లు. ఎవరికి వారు తమ తమ పరిధిల్లో హైకమాండ్ స్థాయిలో పైరవీలు చేశారు. కానీ అత్యధికంగా ఎమ్మెల్యేలు గంప గుత్తగా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇక సీఎం రేసులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన టీపీసీసీ చీఫ్ తో పాటు మధిరలో గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు దామోదర రాజ నరసింహ ఉన్నారు. ఎవరి వైపు ఏఐసీసీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని టెన్షన్ కు లోనవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
Also Read : Revanth Reddy : ప్రజా పాలనకే ప్రయారిటీ – రేవంత్
