MIM Win : ఎట్ట‌కేల‌కు గ‌ట్టెక్కిన ఎంఐఎం

పోటీ ఇచ్చిన ఎంబీటీ..కాంగ్రెస్

MIM : హైద‌రాబాద్ – అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా మ‌ద్ద‌తు ప‌లికిన ఎంఐఎం ఈసారి ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీని ఎదుర్కొంది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌కు లోనైంది. పాత న‌గ‌రంలో మ‌రోసారి త‌న ప‌ట్టును నిలుపుకునేందుకు నానా తంటాలు ప‌డింది. ఇది ఒక ర‌కంగా ఎంఐఎంకు(MIM) గుణ పాఠం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

MIM Win Viral

ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ న‌గ‌ర ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ బ‌హిరంగంగానే అహంకార పూరితంగా రాక్ష‌స పాల‌న సాగించిన దొర కేసీఆర్ కు అండ‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్ర‌సంగించారు. చివ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్త‌గా హ‌స్తం అధికారంలోకి రావ‌చ్చ‌ని ప్ర‌క‌టించాయి.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంబీటీ పార్టీల అభ్య‌ర్థులు ఎంఐఎం అభ్య‌ర్థుల‌కు చివ‌రి దాకా చుక్క‌లు చూపించారు. 9 సీట్ల‌లో ఈసారి బ‌రిలోకి దింపారు ఓవైసీ. విచిత్రం ఏమిటంటే భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ అజ‌హ‌రుద్దీన్ కు వ్య‌తిరేకంగా నిలిపారు.

గ‌తంలో ఉన్న సీట్ల‌ను తిరిగి కైవ‌సం చేసుకునేందుకు తిప్ప‌లు ప‌డింది ఎంఐఎం. చార్మినార్, యాకుత్ పుర‌, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, బ‌హ‌దూర్ పుర‌, మ‌ల‌క్ పేట‌, కార్వాన్, నాంప‌ల్లిల‌లో గెలుపొందారు. ఇక రాజేంద్ర న‌గ‌ర్ , జూబ్లీహిల్స్ స్థానాల‌లో ఓట‌మి పాలైంది.

Also Read : Congress CM : తెలంగాణ బాస్ పై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!