Eatala Rajender : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకుడిగా, సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఈసారి ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు గజ్వేల్ లో బరిలోకి దిగారు. దీంతో ప్రజలు జీర్ణించు కోలేక పోయారు.
Eatala Rajender Loss
ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్(Eatala Rajender) ఆశలపై నీళ్లు చల్లారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి గజ్వేల్ లో బరిలోకి దిగారు. ఇదే సమయంలో హుజూరాబాద్ లో తనను గెలిపించిన వారిని విస్మరిస్తారేమోనని అక్కడి నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురైనట్లు సమాచారం.
ఎవరూ ఊహించ లేదు ఈటల రాజేందర్ ఓడి పోతాడని. ఆయన కీలకమైన నాయకుడిగా ఉన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందారు బీసీ నేతగా. మరో వైపు ఎమోషనల్ గా దెబ్బ కొట్టాడు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన పాడి కౌశిక్ రెడ్డి. గెలిపిస్తే జైత్రయాత్ర చేస్తానని లేక పోతే కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంటానంటూ ప్రకటించారు.
దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోక పోవడం విస్తు పోయేలా చేసింది. ఇక గజ్వేల్ లో రెండో స్థానంలో నిలిచారు ఈటల రాజేందర్. ఇక హుజూరాబాద్ లో పూర్తిగా ఈటల రాజేందర్ ను పక్కన పెట్టడం మరోసారి పునరాలోచించు కోవాల్సిన అవసరం ఉంది.
Also Read : MIM Win : ఎట్టకేలకు గట్టెక్కిన ఎంఐఎం
