Jithender Reddy : బండిని తప్పించడం తప్పే
అందుకే బీజేపీకి సీట్లు రాలేదు
Jithender Reddy : హైదరాబాద్ – బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఆముదాలపాడు జితేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ముగియడం, ఫలితాలు రావడంపై స్పందించారు . సోమవారం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Jithender Reddy Comment About Bandi Sanjay
బీజేపీ హై కమాండ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాష్ట్రంలో ఉన్నట్టుండి మంచి స్థితిలో ఉన్న సమయంలో పార్టీ చీఫ్ గా ఉన్న ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ ను తప్పించడం తప్పేనని అభిప్రాయపడ్డారు. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
అయితే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని, తాను గెలిచినా ఓడి పోయినా పాలమూరు జిల్లాను వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు జితేందర్ రెడ్డి(Jithender Reddy). తాను ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. అయితే బీజేపీ నాయకత్వాన్ని మార్చడంతో యువత తీవ్ర నిరాశకు గురైందన్నారు. లేక పోయి ఉండి ఉంటే తాము కింగ్ పిన్ గా మారి ఉండేవారమన్నారు జితేందర్ రెడ్డి.
ఇక రాష్ట్రంలో బీజేపీ వెనుకబడడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూశారని పేర్కొన్నారు మాజీ ఎంపీ. గతంలో కంటే ఈసారి తమ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని, బీఆర్ఎస్ కంటే బీజేపీనే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read : CMD Prabhakar Rao : సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా