PM Modi : రాబోయే కాలం కాషాయానికే ప‌ట్టం

మూడు రాష్ట్రాల‌లో క‌మ‌ల వికాసం

PM Modi : న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్లిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రిహార్స‌ల్స్ గా భావించామ‌ని, ప్ర‌జ‌లు తాము కోరుకున్న దానికంటే ఎక్కువ‌గా త‌మ పార్టీ ప‌ట్ల సానుకూల‌త వ్య‌క్తం చేశార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్, మ‌ధ్య ప్ర‌దేశ్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

PM Modi Comment

విచిత్రం ఏమ‌టంటే ఇండియా కూట‌మిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి నార్త్ లో గ‌ట్టి దెబ్బ త‌గిలింది. రాజస్తాన్ తో పాటు చ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో ఉన్న ప్ర‌భుత్వాల‌ను కోల్పోయింది. ఇది ఆ పార్టీకి , కూట‌మికి బిగ్ షాక్.

ఇక తెలంగాణ‌లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓట‌మి పాలైంది. కాంగ్రెస్ ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇది ప‌క్క‌న పెడితే భార‌తీయ జ‌న‌తా పార్టీకి అనూహ్యంగా 8 సీట్లు గెలుచుకుంది. ప్ర‌స్తుతం ఓటింగ్ శాతం పెర‌గ‌డం ప‌ట్ల ఆ పార్టీ సంతోషం వ్య‌క్తం చేసింది.

ఇదే స‌మ‌యంలో సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు మోదీ(PM Modi). పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు. దేశ ప్ర‌జ‌లు సుస్థిర‌మైన పాల‌న‌ను కోరుకుంటున్నార‌ని తెలిపారు.

Also Read : Jithender Reddy : బండిని త‌ప్పించ‌డం త‌ప్పే

Leave A Reply

Your Email Id will not be published!