Animal Movie Collections : యానిమ‌ల్ క‌లెక్ష‌న్ల సునామీ

దేశ వ్యాప్తంగా భారీ ఆద‌ర‌ణ

Animal Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యానిమ‌ల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. డిసెంబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. తొలి రోజు రూ. 100 కోట్లు దాటింది. ఆదివారం నాటికి మూడు రోజుల‌కు గాను ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వ‌సూలు చేసిన‌ట్లు స‌మ‌చారం.

Animal Movie Collections Viral

యానిమ‌ల్ మూవీని తండ్రీ, కొడుకుల మ‌ధ్య అనుబంధానికి ప్ర‌తీక‌గా ఉండేలా తెర కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు వంగా సందీప్ రెడ్డి. ఈ చిత్రంలో ర‌ణ బీర్ క‌పూర్ తో పాటు అందాల ముద్దుగుమ్మ ర‌ష్మికా మంద‌న్నా , అనిల్ కపూర్ , బాబి డియోల్ న‌టించారు.

విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. మేకింగ్, టేకింగ్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడు వంగా సందీప్ రెడ్డి. మొత్తంగా యానిమ‌ల్(Animal) ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో సంచ‌ల‌నం రేపింది. తెలుగులో దిల్ రాజ్ తీసుకున్నాడు. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశాడు. వ‌ర్క‌వుట్ అయిన‌ట్లు టాక్.

యానిమ‌ల్ తీసేందుకు రూ. 200 కోట్లు ఖ‌ర్చు కాగా కేవ‌లం సినిమా విడుద‌లైన 2 రోజుల్లోనే వ‌సూలు చేయ‌డం విశేషం. మొత్తంగా ఇప్ప‌టి దాకా సినిమా క‌లెక్ష‌న్స్ రూ. 356 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం.

Also Read : PM Modi : రాబోయే కాలం కాషాయానికే ప‌ట్టం

Leave A Reply

Your Email Id will not be published!