Mallikarjun Kharge : ఇవాళే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రానుంది. ఎవరు అవుతారనే దానిపై ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేసింది ఏఐసీసీ.
ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం లోపు అభ్యర్థి ఎవరనేది స్పష్టం చేస్తామని పేర్కొన్నారు.
Mallikarjun Kharge Comment
ఇప్పటి దాకా టెన్షన్ నెలకొన్న దానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఏఐసీసీ చీఫ్. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి స్పస్టమైన మెజారిటీ వచ్చింది. అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 60 సీట్లు రావాల్సి ఉంటుంది.
కాగా మొత్తం 119 సీట్లకు గాను హస్తానికి 64 సీట్లు రాగా మిత్రపక్షం సీపీఐకి ఒక సీటు వచ్చింది. దీంతో 65 సీట్లు దక్కాయి. బీఆర్ఎస్ కు 39 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, ఎంఐఎంకు 7 సీట్లు దక్కాయి. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలనే దానిపై కీలక భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని ఎస్లా హోటల్ లో సమావేశం అయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేలు పూర్తిగా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
ఇది పక్కన పెడితే సీఎం రేసులో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజ నరసింహ ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి సాయంత్రానికల్లా టెన్షన్ కు తెర పడనుందన్నమాట .
Also Read : MK Stalin : తమిళనాడులో రెడ్ అలర్ట్ – సీఎం