Actor Vishal : చెన్నై – ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమిళనాడు అంతటా తుపాను కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం నీట మునిగింది. చాలా చోట్ల నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి.
Actor Vishal Complaint
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. భారీ వరద దెబ్బకు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రహదారులు, కాలనీలు వరదలు ముంచెత్తాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు విశాల్.
ఈ నేపథ్యంలో చెన్నై నగర మేయర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . తీవ్ర విమర్శలు గుప్పించారు. 2015 లో కురిసిన భారీ వర్షాల దెబ్బకు చెన్నై నగరం ఒక నెల పాటు స్తంభించి పోయిందన్నారు. ఏళ్లు గడిచినా నగర పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నటుడు విశాల్.
వరద నివారణకు చేపట్టిన డ్రెయిన్ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాక పోవడం ప్రభుత్వ వైఫల్యమేనంటూ వాపోయారు. ఇదిలా ఉండగా విశాల్(Vishal ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం తమకు పూర్తిగా కరెంట్ లేకుండా పోయింద్నారు నటుడు.
Also Read : Baba Balak Nath : ఎవరీ బాబా బాలక్ నాథ్