Sheshadri IAS : సీఎంఓ కార్యదర్శిగా శేషాద్రి
నియమించిన సీఎం రేవంత్ రెడ్డి
Sheshadri IAS : హైదరాబాద్ – తెలంగాణ నూతన సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడు పెంచారు. తాను మాటలు చెప్పనని చేసి చూపిస్తానని చెప్పకనే చెప్పారు. వచ్చీ రావడంతోనే తాము పాలకులం కామని ప్రజా సేవకులమని స్పష్టం చేశారు. ఎవరైనా ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని తెలిపారు. ఎవరైనా ఇబ్బంది పెడితే తనకు చెప్పాలని పేర్కొన్నారు.
Sheshadri IAS As a CMO Secretary
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాజ్ హోటల్ కు బయలు దేరారు. అక్కడ హైకమాండ్ పెద్దలతో చర్చించారు. ఆ వెంటనే మంత్రులకు శాఖలను కేటాయించారు. అక్కడి నుంచి నేరుగా కొత్త సచివాలయానికి చేరుకున్నారు.
తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి మంత్రివర్గంతో తొలిసారి సమీక్ష చేపట్టారు. ఇదే సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంఓ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రిని నియమించారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివ ధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
Also Read : CM Revanth Reddy Review : సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష