Shiva Dhar Reddy : ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివ‌ధ‌ర్ రెడ్డి

నియ‌మించిన సీఎం రేవంత్ రెడ్డి

Shiva Dhar Reddy : హైద‌రాబాద్ – నూత‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. త‌న టీంను మెల మెల్ల‌గా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే సీఎంఓ కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ శేషాద్రిని నియ‌మించారు. ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన శాఖ‌గా భావించే ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్ గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ బి. శివ ధ‌ర్ రెడ్డికి అప్ప‌గించారు. ఈ మేర‌కు వెంట‌నే ఉత్త‌ర్వులు ఇవ్వాల్సిందిగా సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.

Shiva Dhar Reddy as Intelligence Chief

ఇదిలా ఉండ‌గా బి. శివ ధ‌ర్ రెడ్డిది(Shiva Dhar Reddy) స్వ‌స్థ‌లం తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా. ఆయ‌న 1994 బ్యాచ్ కు చెందిన వారు. ఎల్ఎల్బీ వ‌ర‌కు చ‌దివారు. ఉస్మానియాలో చ‌దువుకుంటూ సివిల్స్ కు హాజ‌ర‌య్యారు. 1993లో టాప‌ర్ గా నిలిచారు. ప్ర‌స్తుతం పోలీస్ శాఖ‌లో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు.

స‌ర్వీస్ లో భాగంగా ఏఎస్పీగా ప‌ని చేశారు. న‌ల్ల‌గొండ‌, శ్రీ‌కాకుళం, గుంటూరు, నెల్లూరు వంటి ప‌లు జిల్లాల‌కు ఎస్పీగా ప‌ని చేశారు. హైద్రాబాద్ లో డీసీపీగా ప‌ని చేసిన అనుభ‌వం కూడా ఉంది. డీఐజీగా ప‌లు ఉన్న‌త స్థానాల్లో త‌న‌దైన ముద్ర వేశారు.

విధుల్లో భాగంగా ఏపీ ఏసీబీ డైరెక్ట‌ర్ గా ఉన్నారు. రెండుసార్లు రాష్ట్ర‌ప‌తి ప‌త‌కం అందుకున్నారు.

Also Read : Sheshadri IAS : సీఎంఓ కార్య‌ద‌ర్శిగా శేషాద్రి

Leave A Reply

Your Email Id will not be published!