Priyanka Gandhi : అమరావతి సభకు ప్రియాంక
జేఏసీ కోరికకు సానుకూల స్పందన
Priyanka Gandhi : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు అమరావతి వాసులు. భూములు కోల్పోయిన నిర్వాసితులు, ప్రత్యేకించి పెద్ద ఎత్తున నష్ట పోయిన రైతులు. అమరావతి కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు గత నాలుగు సంవత్సరాల కాలంగా కొనసాగిస్తూ వచ్చారు.
Priyanka Gandhi May be Came Amaravathi Meeting
తాజాగా అమరావతి పోరాటానికి సంబంధించి సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. దీని ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక అమరావతిలో ఆనాటి టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆపై ఏపీకి మూడు రాజధానులు చేస్తానంటూ ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ రాజధానిగా ఇప్పటికే డిక్లేర్ చేశారు .
దీంతో బాధితులు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఇక అమరావతి ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తాజాగా అమరావతి కేంద్రంగా ఈనెల 17న ఏపీ కేంద్రీకృత, ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ భారీ సభను ఏర్పాటు చేశారు.
ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నేతలు ప్రియాంక గాంధీని(Priyanka Gandhi) కలుసుకుని రావాలని కోరారని, ఆ మేరకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Also Read : Damodara Raja Narasmha