Sunil Gavaskar : కపిల్ తో పాండ్యాను పోల్చితే ఎలా
మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కామెంట్
Sunil Gavaskar : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రికెట్ పరంగా చూస్తే వన్డే వరల్డ్ కప్ ను 1983లో తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించాడు హర్యానా హరికేన్ కపిల్ దేవ్.
Sunil Gavaskar Comment
ఇదిలా ఉండగా ఈ మధ్యన ముంబైకి చెందిన హార్దిక్ పాండ్యాను కొందరు కపిల్ దేవ్ నిఖంజ్ లాంటి దిగ్గజ క్రికెటర్ తో పోల్చారు. దీనిపై తీవ్రంగా స్పందించాడు మరో దిగ్గజ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar).
శిఖరం ఎత్తున ఉన్న కపిల్ దేవ్ ఎక్కడ భూమి మీద ఉన్న పాండ్యా ఎక్కడ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి ఆట తీరు వారిదే. కానీ ఒకరిని ఇంకొకరితో ఎలా పోలుస్తారంటూ ప్రశ్నించారు సునీల్ మనోహర్ గవాస్కర్.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు. ఇలాంటి పోలికలు చేసే వారికి ఆట పట్ల, ఆటగాళ్ల పట్ల సరైన అవగాహన ఉందని తాను అనుకోవడం లేదన్నారు. కపిల్ దేవ్ అద్బుతమైన ఆటగాడు అని, అంతకు మించిన ఆల్ రౌండర్ గా ఎల్లప్పటికీ గుర్తుండి పోతాడని కితాబు ఇచ్చాడు. తను చూసిన క్రికెట్ దిగ్గజాలలో కపిల్ ఒకడు అని పేర్కొన్నారు సునీల్ గవాస్కర్.
Also Read : IPL Auction 2024 : ఐపీఎల్ వేలానికి వేళాయె