IPL Auction 2024 : 77 మంది ఆట‌గాళ్లు రూ. 262 కోట్లు

అమ్ముడు పోయిన ఆటగాళ్లు వీరే

IPL Auction 2024 : దుబాయ్ – బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో వ‌చ్చే ఏడాది 2024లో జ‌రగ‌బోయే ఐపీఎల్(IPL) కు సంబంధించి దుబాయ్ వేదిక‌గా ఆదివారం వేలం పాట జ‌రిగింది. మొత్తం 332 ఆట‌గాళ్ల‌కు గాను కేవ‌లం 77 మంది ఆట‌గాళ్ల‌నే ఎంచుకున్నాయి ఐపీఎల్ లోని 10 జ‌ట్ల యాజ‌మాన్యాలు.

IPL Auction 2024 Updates

ఇక ఈసారి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయారు ఆసిస్ ఆట‌గాళ్లు. వారిలో ఇద్ద‌రూ టాప్ బౌల‌ర్లు ఉండ‌డం విశేషం. మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్ల‌కు అమ్ముడు పోయి విస్తు పోయేలా చేశాడు. ఇక పాట్ క‌మిన్స్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ. 20.50 కోట్ల‌కు తీసుకుంది.

ఇక మిచెల్ ను కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తీసుకుంది. కీవీస్ ఆల్ రౌండ‌ర్ డారిల్ మిచెల్ ను రూ. 14 కోట్ల‌కు తీసుకుంది చెన్నై సూప‌ర్ కింగ్స్ . హ‌ర్ష‌ల్ ప‌టేల్ ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఇక క్రిస్ వోక్స్ రూ. 4.2 కోట్ల‌కు అమ్ముడు పోయాడు. ర‌చిన్ ర‌వింద్ర‌, శార్దూల్ ల‌ను సీఎస్కే తీసుకుంది.

ఇక అమ్ముడు పోయిన ఆట‌గాళ్ల జాబితా చూస్తే ..పావెల్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ. 7.40 కోట్ల‌కు ద‌క్కించుకుంది. బ్రూక్ ను రూ. 4 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ , ట్రావిస్ ను రూ. 6.80 కోట్ల‌కు, హ‌స‌రంగాను రూ. 1.50 కోట్ల‌కు ఎస్ ఆర్ హెచ్ తీసుకుంది.

ర‌చిన్ ర‌వీంద్ర ను రూ. 1.80 కోట్ల‌కు, శార్దూల్ ను రూ. 4 కోట్ల‌కు సీఎస్కే ద‌క్కించుకుంది. అజ్మ‌తుల్లా ను రూ. 50 ల‌క్ష‌ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ , పాట్ క‌మిన్స్ ను రూ. 20. 50 కోట్ల‌కు స‌న్ రైజ‌ర్స్ , గెరాల్డ్ కోయెట్టీ ని రూ. 5 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ ను రూ. 11.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ , డారిల్ మిచెల్ ను రూ. 14 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ కైవ‌సం చేసుకుంది.

ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ ను రూ. 50 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ , కేఎస్ భ‌ర‌త్ ను రూ. 50 ల‌క్ష‌ల‌కు , చేత‌న్ స‌కారియాను రూ. 50 ల‌క్ష‌ల‌కు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ద‌క్కించుకుంది. జోసెఫ్ ను రూ. 11.50 కోట్ల‌కు ఆర్సీబీ తీసుకుంది. ఉమేష్ యాద‌వ్ ను రూ. 5.8 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ , శివ‌మ్ మావిని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ. 6.40 కోట్ల‌కు, ఉనాద్క‌త్ ను ఎస్ఆర్ హెచ్ .1.60 కోట్ల‌కు , మ‌ధుశంక ను ముంబై ఇండియ‌న్స్ రూ. 4.6 కోట్ల‌కు ద‌క్కించుకున్నాయి.

Also Read : Mitchell Starc IPL : రూ. 23 కోట్ల‌కు మిచెల్ స్టార్క్

Leave A Reply

Your Email Id will not be published!