Ambati Ram Babu : అమరావతి – ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర అట్టర్ ప్లాప్ అని ఎద్దేవా చేశారు. మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
Ambati Ram Babu Comments on Nara Lokesh
కేవలం ప్రచారం తప్ప ఎవరూ ఆదరించడం లేదన్నారు. పాదయాత్ర తర్వాత లోకేష్ మాట తీరులో ఎలాంంటి మార్పు రాలేదన్నారు. ఇప్పటికే తన తండ్రి చంద్రబాబు నాయుడు ను రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నా జగన్ ను కావాలని టార్గెట్ చేయడం దారుణమన్నారు.
వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు అంబటి రాంబాబు(Ambati Ram Babu). లోకేష్ యాత్రను ప్రజలు ఎవరూ పట్టించు కోలేదన్నారు. ఇక జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోజులకు తప్ప దేనికీ పనికి రాడంటూ ఎద్దేవా చేశారు. యాంకర్ స్థాయికి దిగజారి పోయాడంటూ మండిపడ్డారు మంత్రి.
టీడీపీ, జనసేన తో పాటు ఇంకా ఎన్ని పార్టీలు కలిసికట్టుగా వచ్చినా బాహుబళి లాంటి జగన్ ను తట్టుకోలేరన్నారు. ఆయనను శునకంతో పోల్చారు అంబటి రాంబాబు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
ఏది ఏమైనా ఇకనైనా తండ్రీ కొడుకులు మారాలని లేక పోతే జనం మరోసారి కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వడం ఖాయమన్నారు.
Also Read : KCR Medigadda : మేడిగడ్డ డిజైన్ చేసింది కేసీఆరే