Salaar Movie Rates : స‌లార్ బెనిఫిట్ షోకు సీఎంలు ఓకే

ఏపీ, తెలంగాణ స‌ర్కార్లు ఖుష్ క‌బ‌ర్

Salaar Movie Rates : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శృతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్(Salaar) చిత్రానికి తీపి క‌బురు ల‌భించింది. సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ చిత్ర యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ ముఖ్య‌మంత్రులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఎనుముల రేవంత్ రెడ్డిల‌కు విన్న‌వించింది.

Salaar Movie Rates Viral

ఈ మేర‌కు ఇద్ద‌రు సీఎంలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. బెనిఫిట్ షోల‌తో పాటు అద‌న‌పు షోస్ కు కూడా అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతే కాదు టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం విశేషం.

మ‌ల్టీప్లెక్స్ ల‌లో గ‌రిష్టంగా రూ. 100 పెంచుకునేందుకు కూడా ప‌చ్చ జెండా ఊపాయి. ఇక సాధార‌ణ థియేట‌ర్ల‌లో రూ. 65 చొప్పున పెంచుకునేలా ఓకే చెప్పాయి. ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స‌లార్ చిత్ర టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు తాత్కాలికంగా అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేట‌ర్ల‌లో రూ. 40 రూపాయ‌లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.

Also Read : Ambati Ram Babu : లోకేష్ యాత్ర అట్ట‌ర్ ప్లాప్

Leave A Reply

Your Email Id will not be published!