తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో ఇప్పటి వరకు మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీటి మట్టం పెరిగిందని తెలిపింది. తిరుమలలో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయని పేర్కొంది. ఈ ఐదు జలాశయాల్లో కలిపి 21.60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా, 40.08 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా నిల్వ ఉంది. జలాశయాల వారీగా నీటి నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి. పాప వినాశనం డ్యామ్ నిల్వ సామర్థ్యం 5,240.00 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 2,667.39 లక్షల గ్యాలన్లు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం నీటి నిల్వ 2,688.35 లక్షల గ్యాలన్లు కాగా పెరిగిన నీరు 20.96 లక్షల గ్యాలన్లు ఉండగా 14.10 లక్షల గ్యాలన్లు వినియోగించినట్లు స్పష్టం చేసింది టీటీడీ. ఇప్పటి వరకు ఈ డ్యామ్ లో 6.88 లక్షల గ్యాలన్ల నీరు ఉందని తెలిపింది.
గోగర్భం డ్యామ్ నిల్వ సామర్థ్యం 2,833.10 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 508.31 లక్షల గ్యాలన్లు ఉండగా 9..25 లక్షల గ్యాలన్ల నీరు పెరిగిందని , 7.50 లక్షల గ్యాలన్లు వినియోగించినట్లు పేర్కొంది టీటీడీ. ఇప్పటి వరకు 7.50 లక్షల గ్యాలన్లు వినియోగించు కోగా ప్రస్తుతం 1.75 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉందని తెలిపింది. ఆకాశగంగ డ్యామ్ నిల్వ సామర్థ్యం 685.00 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుత నిల్వ 30.40 లక్షల గ్యాలన్లు ఉండగా 6.33 లక్షల గ్యాలన్లు పెరిగిందని, ఇప్పటి వరకు చుక్క నీటిని వినియోగించ లేదని వెల్లడించింది. 6.33 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉందని తెలిపింది.
కుమారధార డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4,259.01 లక్షల గ్యాలన్లు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 363.98 లక్షల గ్యాలన్లు ఉండగా 25.14 లక్షల గ్యాలన్ల నీరు పెరిగిందని టీటీడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఎలాంటి నీటిని వినియోగించు కోలేదని తెలిపింది. ఇక పసుపు ధార డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 1,287.54 లక్షల గ్యాలన్లు ఉండగా ప్రస్తుత నిల్వ 24.38 లక్షల గ్యాలన్లు ఉండగా ఒక్క చుక్క నీటిని వాడుకోలేదని తెలిపింది. మొత్తంగా ఐదు జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు పెరిగితే, 21.60 లక్షల గ్యాలన్ల నీరు వినియోగమైందని స్పష్టం చేసింది. ప్రస్తుతం 40.08 లక్షల గ్యాలన్ల నీరు మిగులుగా ఉందని తెలిపింది. ఆకాశగంగ డ్యామ్ పరిధిలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది.
