AP CM YS Jagan : అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : కృష్ణా జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇందులో భాగంగా ముందస్తుగానే దూకుడు పెంచారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థులను ఖరారుచేశారు సీఎం. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా నగర మేయర్ భాగ్యలక్ష్మిని నియమించారు. అనూహ్యంగా చాలా మంది ఎమ్మెల్యేలను మార్చింది వైసీపీ హైకమాండ్.
AP CM YS Jagan Comment
విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీని కేటాయించడం షాక్ కు గురి చేసింది. విజయవాడ తూర్పు నుంచి సామినేని ఉదయభానుకు ఇచ్చారు. మైలవరం నుంచి జోగి రమేష్ , నందిగామ నుంచి అమర్లపూడి కీర్తి సౌజన్య బరిలో ఉండగా జగ్గయ్యపేటకు వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చారు. గన్నవరం సీటు ను కొలుసు పార్థసారథికి కేటాయించగా పెనమలూరు సీటును దేవినేని అవినాష్ కు కేటాయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర సర్కార్, పార్టీ చీఫ్ జగన్ రెడ్డి(AP CM YS Jagan) వివిధ సంస్థల నుంచి సర్వేలు చేపట్టారు. ఆయా సంస్థలు ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని అభ్యర్థులకు సీట్లు కేటాయించడం, మరికొందరిని మార్చడం జరిగిందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చర్చ మొదలైంది. మరో వైపు వైసీపీ నుంచి సీట్లు దక్కని వారు తమ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని ప్రకటించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.
Also Read : Yuva Galam Nava Shakam : యువ గళం నవ శకం సభ