Telangana Assembly : 42 పేజీలతో శ్వేత పత్రం విడుదల
చదవకుండా మాట్లాడ మంటే ఎలా
Telangana Assembly : హైదరాబాద్ – రాష్ట్ర శాసన సభలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం 42 పేజీలతో శ్వేత పత్రం విడుదల చేశారు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) . 2014-23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ ఖర్చు 82.3 శాతమే ఉందన్నారు. తెలంగాణలో మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు గా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రుణం రూ. 72,658 కోట్లు గా మారిందని పేర్కొన్నారు.
Telangana Assembly White Paper Viral
గత పదేళ్లలో సగటున 24.5 శాతం అప్పులు పేరుకు పోయాయని తెలిపారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లు.. ఎస్పీవీల ద్వారా సేకరించిన రుణం లక్షా 27వేల కోట్లుగా ఉందని వెల్లడించారు డిప్యూటీ సీఎం.
ఈ సందర్బంగా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్చను ప్రారంభించారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య రాష్ట్రం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కలలు కల్లలు అయ్యాయని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే రోజూ వారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడందన్నారు.
దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పు చెప్పారని పేర్కొన్నారు.
Also Read : Bhatti Vikramarka Mallu : శ్వేత పత్రం అప్పుల మయం – భట్టి