Sridhar Babu : అప్పుల కుప్ప తప్పుల తడక
నిప్పులు చెరిగిన శ్రీధర్ బాబు
Sridhar Babu : హైదరాబాద్ – బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో తెలంగాణను సర్వ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu). చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. గులాబీ నేతలు కేవలం తమ ఆస్తులను పెంచు కోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.
Sridhar Babu Slams BRS Ruling
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు ఇన్నాళ్ల పాటు వాస్తవాలను, వివరాలను తెలియ చేయకుండా దాచి పెట్టారని దీంతో ఏ శాఖలో ఏం జరిగిందో తెలియకుండా పోయిందని పేర్కొన్నారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
కేసీఆర్ సారథ్యంలోని సర్కార్ ఏం నిర్ణయాలు తీసుకుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు . అప్పుల కుప్పగా మారిందని, తప్పుల తడకగా మారిందని ఆరోపించారు మంత్రి.
రాష్ట్రంలోని ప్రతి యువకుడిపై రూ. 7 లక్షల అప్పును బీఆర్ఎస్ సర్కార్ మిగిల్చిందని , ఇక ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
Also Read : KTR : రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి