KTR : రాబోయే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలి

పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్

KTR : హైద‌రాబాద్ – త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని ప్ర‌తి ఒక్క‌రు నూత‌న ఉత్సాహంతో పార్టీ బ‌లోపేతం కోసం ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. ఆయ‌న హైద‌రాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

KTR Comment

ఈసంద‌ర్బంగా కేవ‌లం కొద్దిపాటి శాతం ఓటు తేడాతో మ‌నం అధికారాన్ని కోల్పోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు కేటీఆర్. దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎక్క‌డా పొర‌పాట్లు దొర్ల‌కుండా చూసు కోవాల‌ని సూచించారు.

పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, నేత‌లు, పార్టీ బాధ్యులు కార్య‌క‌ర్త‌ల‌తో స‌ఖ్య‌త‌తో ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. కొంత మంది ఒంటెద్దు పోక‌డ పోవ‌డం వ‌ల్ల‌నే అధికారానికి దూర‌మ‌య్యామ‌ని ఈ విష‌యం తెలుసు కోవాల‌ని తెలిపారు.

ఎన్నిక‌ల ఫలితాల నుంచి నిరాశ చెంద‌కుండా ప్ర‌జ‌ల త‌ర‌పున స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపాల‌ని, ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 17 సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Tirumala Rush : వైకుంఠ ద‌ర్శ‌నం టికెట్లు విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!