JD Laxminarayana : అవినీతి లేని వ్యవస్థ కావాలి
సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ
JD Laxminarayana : అమరావతి – సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఇందులో భాగంగా జేడీ లక్ష్మీ నారాయణ(JD Laxminarayana) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
JD Laxminarayana Comment
రాజకీయాలు అంటే మోసం కాదని, సుపరిపాలన అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో ఏపీలో అన్ని పార్టీలు విఫలం అయ్యాయని ఆరోపించారు. హోదా సాధించేందుకే తాను జేబీఎన్పీ ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎవరికి వారు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారని , అవినీతికి పాల్పడ లేదంటూ మాయ మాటలు చెబుతున్నారంటూ ఆరోపించారు. కరప్షన్ లేని సమాజం కోసమే కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ.
రాష్ట్రంలో కొలువు తీరిన పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ఆనాటి చంద్రబాబు నాయుడు, నేటి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
Also Read : AP CM YS Jagan : స్వంత జిల్లాపై జగన్ రెడ్డి ఫోకస్