Amit Shah : అన్ని స‌మ‌స్య‌ల‌కు గీత‌లో ప‌రిష్కారం

కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కామెంట్

Amit Shah : ప్ర‌పంచంలో ఉన్న అన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి భ‌గ‌వ‌ద్గీత మార్గం చూపుతుంద‌ని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. గీతాసారం దేశం న‌లుమూల‌ల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Amit Shah Comment

హ‌రియాణా లోని కురుక్షేత్రలో అంత‌ర్జాతీయ గీతా మ‌హోత్స‌వం నిర్వ‌హించారు. వేలాది మంది హాజ‌ర‌య్యారు. సంత్ స‌మ్మేళ‌న్ ను విజ‌య‌వంతం చేయ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు అమిత్ చంద్ర షా(Amit Shah). ప్ర‌తి ఒక్క‌రు గీత‌ను చ‌ద‌వాల‌ని, విధిగా ఆచ‌రించాల‌ని పిలుపునిచ్చారు.

నిత్య జీవితంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను, స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు, క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించేందుకు భ‌గ‌వ‌ద్గీత మార్గంగా ఉప‌యోగ ప‌డుతుంద‌ని చెప్పారు. ప్ర‌పంచంలో ఉన్నదంతా గీతలోనే ఉంద‌న్నారు కేంద్ర హోం శాఖ మంత్రి.

స‌త్యం, ధ‌ర్మం అన్న‌ది ఆచ‌రించాల‌ని , దీనిని ప్ర‌తి ఒక్క‌రూ అనుస‌రించాల‌ని పిలుపునిచ్చారు అమిత్ షా. స‌మాజంలో దేనినైనా సాధించాలంటే ఒక్క భ‌గ‌వ‌ద్గీత‌ను చ‌దివితే చాల‌ని పేర్కొన్నారు కేంద్ర హొం శాఖ‌. గీతోప‌దేశం ప్ర‌తి నిత్యం అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : JD Laxminarayana : అవినీతి లేని వ్య‌వ‌స్థ కావాలి

Leave A Reply

Your Email Id will not be published!