Bhadrachalam Ekadasi : ఘనంగా ఏకాదశి వేడుకలు
భద్రాచలం భక్త జన సందోహం
Bhadrachalam Ekadasi : ఖమ్మం జిల్లా – ఏకాదశి పర్వదినం శనివారం కావడంతో ఉమ్మడి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ(Telangana) లలోని పుణ్య క్షేత్రాలు భక్తులతో నిండి పోయాయి. ఎక్కడ చూసినా భక్త జనమే. తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. ఈనెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు నేరుగా భక్తులకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ).
Bhadrachalam Ekadasi Updates
మరో వైపు ఖమ్మం జిల్లాలో పేరు పొందిన భద్రాచలం లో ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ సీతారామ చంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కలుగుతోంది. ఉదయం 5 గంటల నుంచే స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది ఆలయ పాలక మండలి.
ఇదిలా ఉండగా గరుడ వాహనంపై శ్రీరాముడు ఊరేగారు. గజ వాహనంపై సీతమ్మ తల్లి దర్శనం ఇచ్చారు. హనుమత్ వాహనంపై లక్ష్మణుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ , ఏపీఎస్ఆర్టీసీ భారీ ఎత్తున బస్సులను ఏర్పాటు చేశాయి.
ఇదే సమయంలో తమిళనాడు, మహారాష్ట్ర ల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు సీతారామ చంద్ర స్వామిని దర్శించుకునేందుకు.
Also Read : BRS Swetha Patram : సర్కార్ పై గులాబీ స్వేద పత్రం