Salaar Movie : స‌లార్ ఊచ‌కోత రికార్డుల మోత

డార్లింగ్ ప్ర‌భాస్..ప్ర‌శాంత్ నీల్ కాంబో

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ రికార్డుల మోత మోగిస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే దేశంలో ఏ సినిమాకు లేనంత‌టి క్రేజ్ ద‌క్కింది. విడుద‌లైన తొలి షో నుంచి నేటి దాకా కాసులు కురిపిస్తోంది. బాక్సుల‌న్నీ బ‌ద్ద‌ల‌య్యేలా దూసుకు పోతోంది స‌లార్ మూవీ.

Salaar Movie Updates

ఈ ఏడాదిలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన స‌లార్(Salaar) ఊహించ‌ని రీతిలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు కిక్కు ఎక్కించేలా తీయ‌డంతో ఫుల్ జోష్ లో ఉన్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా రెబ‌ల్ స్టార్ క్రేజ్ కొన‌సాగుతూనే ఉంది. కాసుల వ‌ర్షం కురిపిస్తూనే వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా ఏపీ, తెలంగాణ‌లో రూ. 69.24 కోట్లు వ‌సూలు చేస్తే క‌ర్ణాట‌క‌లో రూ. 12.06 కోట్లు, త‌మిళ‌నాడులో రూ. 7.11 కోట్లు, కోల్ క‌తా లో రూ. 5.14 కోట్లు సాధించ‌గా ఓవ‌ర్సీస్ లో రూ. 60.15 కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇదిలా ఉండ‌గా టోట‌ల్ గా రూ. 176.52 కోట్లు వ‌సూలైన‌ట్లు సినీ ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. అన్ని భాష‌ల‌తో క‌లిపి దూసుకు పోతోంది. కాగా స‌లార్ మూవీ తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళం, హిందీతో పాటు 5 భాష‌ల్లో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

Also Read : Bhadrachalam Ekadasi : ఘ‌నంగా ఏకాద‌శి వేడుక‌లు

Leave A Reply

Your Email Id will not be published!