TTD Tokens : 7 లక్షల టోకెన్లు జారీ – టీటీడీ
వైకుంఠ ద్వారా దర్శనం కోసం
TTD Tokens : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమల గిరులు భక్తులతో నిండి పోయింది. గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా అంటూ భక్తులు స్మరిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు.
TTD Tokens Issued
ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 10 రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించనుంది. ఈనెల 23న ప్రారంభమైన ఈ దర్శన సౌకర్యం వచ్చే ఏడాది జనవరి 1 వరకు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
ఇదిలా ఉండగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రతి రోజూ 70 వేలకు పైగా టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.
మరో వైపు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్త బాంధవులు. ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారు. చిన్నారులు, తల్లులు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు టీటీడీ(TTD) చర్యలు చేపట్టినా చివరకు అన్నదానం అత్యంత దారుణంగా ఉందంటూ భక్తులు వాపోతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం సమకూరినా సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యిందంటూ టీటీడీపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Also Read : AICC Focus : ఏపీ కాంగ్రెస్ పై ఏఐసీసీ ఫోకస్