AICC Focus : ఏపీ కాంగ్రెస్ పై ఏఐసీసీ ఫోక‌స్

పార్టీ ప‌రిస్థితిపై రాహుల్ ఆరా

AICC Focus : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త్వ‌ర‌లో శాస‌న స‌భ , లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ద‌క్షిణాదిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీని , తెలంగాణ‌లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీని ఓడించింది.

AICC Focus on AP Elections

దేశ వ్యాప్తంగా ఆక్టోప‌స్ లా విస్త‌రించింది ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆధ్వ‌ర్యంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ విస్త‌రించింది. దీనిని అడ్డుకునేందుకు ఇండియా కూట‌మి ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మావేశం నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

దీంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోక‌స్ పెట్టింది. కేర‌ళ‌ల‌లో సీపీఎం , త‌మిళ‌నాడులో డీఎంకే, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఈనెల 27న కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కీల‌క భేటీ కానున్నారు.

ఎలాగైనా స‌రే ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్రంలో అధికారంలోకి రాక పోయినా నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించాల‌ని స్ప‌ష్టం చేశారు ఇప్ప‌టికే ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఇప్ప‌టికే అమ‌రావ‌తి జేఏసీ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నేత‌లు ఏఐసీసీ బాధ్యుల‌ను క‌లుసుకున్నారు.

Also Read : Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Leave A Reply

Your Email Id will not be published!