Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ల‌భ్యం

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు వీలు క‌ల్పించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ).

Tirumala Rush with Devotees

పుణ్య క్షేత్రం పూర్తిగా నిండి పోయింది. ఎక్క‌డ చూసినా భ‌క్తులే ద‌ర్శ‌నం ఇస్తున్నారు. 63 వేల 519 మంది భ‌క్తులు స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. 26 వేల 424 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఈ సంద‌ర్బంగా టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు. శ్రీ‌వారి సేవ‌కుల‌తో పాటు టీటీడీ(TTD) సిబ్బంది, ఉద్యోగులు వ‌స‌తి సౌక‌ర్యాల ఏర్పాటు లో నిమ‌గ్నం అయ్యారు.

ఇదిలా ఉండ‌గా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్భంగా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు నిలిపి వేసిన‌ట్లు టీటీడీ తెలిపింది. జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇదే స‌మ‌యంలో 10 రోజుల పాటు రోజుకు 70 వేల చొప్పున టికెట్లు జారీ చేసింది.

Also Read : CM Revanth Reddy : అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మోపాలి

Leave A Reply

Your Email Id will not be published!