CM Revanth Reddy : అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మోపాలి

నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి ర‌హిత పాల‌న అందించడం త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ గ‌త ప్ర‌భుత్వంలో కొలువు తీరిన వారంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని , తేడా వ‌స్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

CM Revanth Reddy Comment

పాల‌కులు 5 ఏళ్ల కాలం ఉంటార‌ని కానీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు 35 ఏళ్ల పాటు స‌ర్వీసులో ఉంటార‌ని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం అనేది అదృష్టంగా భావించాల‌ని స్ప‌ష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్ర‌జా పాల‌న కార్య‌క్ర‌మంపై ప్ర‌తి అధికారి చిత్త శుద్దితో ప‌ని చేయాల‌ని పేర్కొన్నారు.

ఇష్టం లేని వాళ్లు బాధ్య‌త‌ల నుంచి త‌ప్పు కోవ‌చ్చ‌ని సూచించారు. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఉండే డ్ర‌గ్ క‌ల్చ‌ర్ ఇవాళ ప‌ట్ట‌ణాలు, గ్రామాల వ‌ర‌కు వెళ్లింద‌న్నారు ర‌వేంత్ రెడ్డి. అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

డ్ర‌గ్స్ వ‌ల్ల పంజాబ్ రాష్ట్రం స‌ర్వ నాశ‌నం అయ్యింద‌ని, అదే స్థితిలో ప్ర‌స్తుతం తెలంగాణ ఉంద‌ని దీనిని నిర్మూలించేందుకు తాము కంక‌ణం క‌ట్టుకున్నామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచేలా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు ప‌ని చేయాల‌ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : Deepa Das Munsi : ఠాక్రేకు షాక్ దీపాకు ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!