TTD Sarva Darshan Tokens : సర్వ దర్శన టోకెన్లు క్లోజ్
భక్తులు గమనించాలన్న టీటీడీ
TTD Sarva Darshan Tokens : తిరుమల – వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) బిగ్ షాక్ ఇచ్చింది భక్తులకు. ప్రతి రోజూ 70 వేలకు పైగా టోకెట్లను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు.
TTD Sarva Darshan Tokens Updates
ఇదిలా ఉండగా ముందు జాగ్రత్తగా టీటీడీ ఆధ్వర్యంలో విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను 4 లక్షలకుపైగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను జారీ చేయడం పూర్తయింది.
తదుపరి అయితే రోజుకు 80 వేల చొప్పున ఇప్పటికే టికెట్లను విక్రయించడం జరిగిందని టీటీడీ(TTD) వెల్లడించింది. ఇదిలా ఉండగా డిసెంబర్ 23 నుండి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తోంది . దీంతో బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఇదే సమయంలో ఎలాంటి సిఫారసు లేఖలు అనుమతించ బోమంటూ ఇప్పటికే ప్రకటించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏఈ ధర్మారెడ్డి.
Also Read : President Murmu : నేర బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం