Ram Mandir Doors : హైదరాబాద్ లో రామ మందిరం తలుపులు
100 తలుపులు తయారు చేసిన కంపెనీ
Ram Mandir Doors : హైదరాబాద్ – ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక వసతులతో వందల కోట్లు ఖర్చు చేసి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అయోధ్యలో రామ మందిరం(Ram Mandir) ను నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆలయానికి సంబంధించి చెప్పుకోదగిన రీతిలో విశేషాలు ఉన్నాయి. ఇదే సమయంలో భారీ ఎత్తున ఆకట్టుకునేలా తయారు చేశారు గుడికి సంబంధించని తలుపులను . వీటిని హైదరాబాద్ లో తయారు చేయడం విశేషం.
Ram Mandir Doors in Hyderabad
ఆలయానికి సంబంధించి మొత్తం 100 తలుపులను తయారు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా 3,000 సంవత్సరాల పాటు మన్నికతో ఉండే టేకు చెక్కను ఇందు కోసం వినియోగించింది అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని సీహెచ్ శరత్ బాబు.
తయారైన తలుపులను సర్వాంగ సుందరంగా తయారు చేశారు. తయారైన వాటిని ఎప్పటికప్పుడు అయోధ్యకు తరలిస్తున్నారు భారీ భద్రత మధ్య. నాణ్యవంతమైన కలపను ఇందు కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చెట్టు సగటు వయస్సు 100 ఏళ్లు. పగుళ్లు లేకుండా చూశామని తెలిపారు.
అయితే శరత్ బాబు కుటుంబం మూడు తరాలుగా ఈ వ్యాపారం చేస్తోంది. అయోధ్య టెంపులు ట్రస్ట్ , లార్సెన్ అండ్ టూబ్రో , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో కలిపి మూడు ఏళ్ల కిందట ఒప్పందం చేసుకున్నట్లు శరత్ బాబు వెల్లడించారు.
Also Read : Covid19 : కరోనా కేసులు తప్పని తిప్పలు