Manickam Thakur : షర్మిల చేరికపై సోనియాదే నిర్ణయం
స్పష్టం చేసిన మాణిక్యం ఠాకూర్
Manickam Thakur : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఓ వైపు చలి తీవ్రత ఉన్నా ఇంకో వైపు రాజకీయంగా నువ్వా నేనా అన్న రీతిలో పార్టీలు , నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయాలలో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి హల్ చల్ చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఉన్నట్టుండి సైలెంట్ అయి పోయారు.
Manickam Thakur Comment
ఆమె ప్రజల కోసం తన తండ్రి వైఎస్సార్, అన్న వైఎస్ జగన్ మాదిరిగానే పాదయాత్ర చేపట్టారు. అప్పటి కేసీఆర్ సర్కార్ ను ఏకి పారేశారు. నిప్పులు చెరిగారు. ఒకానొక దశలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఏమైందో ఏమో కానీ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఉన్నట్టుండి వైఎస్ షర్మిల కాంగ్రెస్(Congress) వైపు మొగ్గు చూపారు.
పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. చివరకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో వైఎస్ షర్మిలకు బిగ్ పోస్ట్ రాబోతోందని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఫోకస్ పెట్టనున్నట్టు టాక్. ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాణిక్కం ఠాకూర్. షర్మిల చేరికపై సోనియా గాంధీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
Also Read : Dunki Movie : ఆశాజనకంగా డుంకీ కలెక్షన్స్