Dunki Movie : ఆశాజ‌న‌కంగా డుంకీ క‌లెక్ష‌న్స్

ఆరు రోజుల‌కు రూ. 271.89 కోట్లు

Dunki Movie : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , తాప్సీ పన్ను క‌లిసి న‌టించిన డుంకీ చిత్రం క‌లెక్ష‌న్లు ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. ఓ వైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ ఈనెల 22 నుంచి విడుద‌లై దుమ్ము రేపుతోంది. ఓ వైపు బాద్ షా మూవీ కూడా విడుద‌లైంది. దీంతో అటు స‌లార్ ఇటు డుంకీ పోటా పోటీగా ప‌రుగులు తీస్తున్నాయి.

Dunki Movie Collections

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది షారుక్ ఖాన్ కు మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. త‌ను న‌టించిన ప‌ఠాన్ , జ‌వాన్ రికార్డుల మోత మోగించింది. ఈ రెండు సినిమాలు రూ. 1,000 కోట్ల చొప్పున వ‌సూలు చేశాయి. షారుక్ ఖాన్ త‌న సినీ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన మూవీస్ గా నిలిచాయి. తాజాగా మూడో సినిమా డుంకీ(Dunki) విడుద‌లై బాక్సులు నిండి పోయేలా చేస్తోంది.

డుంకీ చిత్రం క‌లెక్ష‌న్ల విష‌యానికి వ‌స్తే తొలి రోజు రూ. 57.43 కోట్లు వ‌సూలు చేసింది. 2వ రోజు రూ. 45.10 కోట్లు, 3వ రోజు రూ. 49.71 కోట్లు, 4వ రోజు 52.78 కోట్లు, 6వ రోజు రూ. 20.31 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు డుంకీ చిత్రం ఆరు రోజుల‌కు గాను రూ. 271. 89 కోట్లు వ‌సూలైన‌ట్లు సినీ ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించాయి.

Also Read : Revanth Reddy : వ‌చ్చే డిసెంబ‌ర్ నాటికి జాబ్స్ భ‌ర్తీ

Leave A Reply

Your Email Id will not be published!