Revanth Reddy : వ‌చ్చే డిసెంబ‌ర్ నాటికి జాబ్స్ భ‌ర్తీ

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ నాటికి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. బుధ‌వారం స‌చివాల‌యంలో ప్ర‌జా పాల‌న ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగాడిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, సీఎస్ శాంతి కుమారి స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు.

Revanth Reddy Comment

అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడారు. ప్ర‌స్తుతానికి రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేసేందుకు ఎక‌రాల ప‌రిమితి విధ‌ఙంచ‌డం లేద‌న్నారు. భ‌విష్త‌త్తులో విధించే ఛాన్స్ ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య్న‌తం చేశారు. తాము కొలువు తీరిన వెంట‌నే అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారిన టీఎస్పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌రిగింద‌న్నారు సీఎం.

ప్ర‌స్తుతం క‌మిష‌న్ కు టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ తో పాటు స‌భ్యులు కూడా త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నార‌ని , వీరి రాజీనామాల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ఆమోదించాల్సి ఉంటుంద‌న్నారు సీఎం.

సంత‌కం చేశాక చైర్మ‌న్ , స‌భ్యుల‌ను నియ‌మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. 2024 సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నాటికి 2 ల‌క్ష‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేసి తీరుతామ‌ని చెప్పారు. గ్రూప్ -2 ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉండ‌గా ఇప్ప‌టికే వాయిదా ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ స‌ర్కార్ బేకార్ – లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!