PVR Cinemas Offer : సీనీ ల‌వ‌ర్స్ కు పీవీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్

రూ. 700 ల‌కే మూవీస్ చూసే ఛాన్స్

PVR Cinemas : ముంబై – దేశంలో పేరు పొందిన మూవీ థియేట‌ర్స్ యాజ‌మాన్యం పీవీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సినీ ప్రియుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ప్ర‌స్తుతం సినిమాలు చూడాలంటే త‌ల‌కు మించిన భారంగా మారింది. దీంతో థియేట‌ర్ల వ‌ద్ద‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించే ప‌నిలో ప‌డింది.

PVR Cinemas Offer

ఇందులో భాగంగా ఇప్ప‌టికే బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది పీవీఆర్ సినీ(PVR Cinemas) సంస్థ‌. నార్త్ ఇండియాలో కేవ‌లం రూ. 700 చెల్లిస్తే చాలు నెల రోజుల‌లో సినిమాలు చూసే అవ‌కాశం క‌ల్పించింది. ఈ ఆఫ‌ర్ కు భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

దీంతో ద‌క్షిణాదిన ఉన్న సినిమా థియేట‌ర్ల‌కు సంబంధించి ఈ ఆఫ‌ర్ ను కూడా వ‌ర్తింప చేస్తూ ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది పీవీఆర్. ప్రేక్ష‌కుల‌కు కోసం మూవీ పాస్ విధానం అమ‌లు లోకి తీసుకు రానున్న‌ట్లు వెల్ల‌డించింది.

కేవ‌లం రూ. 699 రూపాయ‌లు మాత్ర‌మే చెల్లిస్తే చాలు నెల‌కు 10 సినిమాలు చూసే అవ‌కాశం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఇక్క‌డ ఓ కండీష‌న్ పెట్టింది. అదేమిటంటే మూవీ పాస్ నెల‌లో వారంలో సోమ‌వారం నుండి గురువారం రోజుల్లో మాత్ర‌మే మూవీస్ చూసే అవ‌కాశం ఉంటుంద‌ని చేదు క‌బురు చెప్పింది.

Also Read : Salaar Box Office : ప్ర‌భాస్ స‌లార్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!