Bhatti Vikramarka : అప్పుల కుప్పగా మారిన తెలంగాణ
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
Bhatti Vikramarka Comment
విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారని, దీనికి కారణం కల్వకుంట్ల ఫ్యామిలీనేనని మండిపడ్డారు భట్టి(Bhatti Vikramarka). శనివారం భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. సింగరేణి కాలరీస్ కు రూ. 19,431 కోట్లు బకాయిలు ఉన్నాయని, జెన్ కోకు రూ. 9,748 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర సర్కార్ బకాయిలు పడిన మొత్తం రూ. 59,580 కోట్లు అని, అయితే రాష్ట్ర విభజన నాటికి కేవలం రూ. 7,259 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. అప్పుల కోసం రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు భట్టి.
రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టాలంటే ప్లాన్ ప్రకారం అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం.
Also Read : Nagarjuna Amala : రేవంత్ ను కలిసిన నాగార్జున..అమల