HCA President : కోల్ కతా – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) చీఫ్ జగన్ మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ సీ ఏ ఆధీనంలోని ఉప్పల్ స్టేడియంను ప్రపంచం లోని మేటి క్రికెట్ మైదానాల్లో ఒకటిగా ఆధునీకరిస్తామని అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు.
HCA President Comment
ఉప్పల్ స్టేడియాన్నీ నవీకరించే ముందు ప్రపంచంలోని అధునాతన క్రికెట్ మైదానాలను పరిశీలించి, క్షుణ్ణంగా అధ్యాయనం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంను జగన్ మోహన్‌రావు సందర్శించారు.
ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో స్టేడియం అభివృద్ధికి తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మైదానం మొత్తం అక్కడున్న సిబ్బందితో కలిసి పరిశీలించారు. వర్షాల సమయంలో తడిసిన పిచ్, అవుట్ ఫీల్డ్‌ను ఎలా వేగంగా ఆర బెడతారు, ఇందుకోసం ఎలాంటి యంత్రాలు ఉపయోగిస్తున్నారు, ఫ్లడ్ లైట్ల పనితీరు, సీటింగ్ సామర్థ్యం పెంపు వంటి విషయాల గురించి ఆరా తీశారు.
భవిష్యత్‌లో పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. ఈ నేపథ్యంలో క్రికెటర్లు, మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అభిమానులకు మంచి అనుభూతి కల్గించేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Also Read : Kishan Reddy : అమృత్ మహోత్సవం విజయవంతం