MLC Parvathareddy: రోడ్డు ప్రమాదం లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు
MLC Parvathareddy: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై టైర్ పంక్ఛర్ అయి స్లో అయిన లారీను వెనుక వెళ్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి(MLC Parvathareddy) ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడగా అతని పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయవాడ నుండి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని నెల్లూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి ప్రమాదంలో గాయాలయ్యాయని తెలిసి వైసిపి అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
MLC Parvathareddy – ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది- ఆసుపత్రి వర్గాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ సూపరింటెండెంట్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ… ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి కారు అద్దాలు గుచ్చుకోవడంతో తల భాగంలో గాయాలు ఉన్నాయి. అన్ని పరీక్షలు నిర్వహించాం. బ్రెయిన్, చెస్ట్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెన్నునొప్పి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు. రెండు వారాలు విశ్రాంతి అవసరం అని తెలిపారు.
ఎమ్మెల్సీను తన కారులో ఆసుపత్రికి తరలించిన జానీ మాస్టర్
ఇది ఇలా ఉండగా ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ వెంటనే స్పందించారు. MLC పర్వతరెడ్డిని, ఇతర క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు తరలించారు. దీనితో జానీ మాస్టర్ స్పందించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
Also Read : TDP MP Kesineni Nani: కేశినేని నానికి చంద్రబాబు షాక్ ?