Bengal ED Case : సోదాలు జరిపిన ఈడీ అధికారులు దాడి చేసారంటూ ఎఫ్ఐఆర్ నమోదు
బెంగాల్ లో ఈడీ అధికారులపై కేసు కలకలం
Bengal ED Case : బెంగాల్లో ఈడీ అధికారులపై దాడులు కొత్త మలుపు తిరిగాయి. ఈడీ అధికారులపై బెంగాల్ అధికారులు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కలకలం సృష్టించింది. బెంగాల్లో ఈడీ వర్సెస్ తృణమూల్ మరింత వేడి పెరిగింది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్కారి పోలీస్ స్టేషన్లో ముగ్గురు ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కలకలం సృష్టించింది. మహిళపై అతిక్రమించి దాడికి యత్నించినందుకు కేసు నమోదైంది. శుక్రవారం టిఎంసి నేత షాజహాన్ నివాసంపై ఈడీ అధికారులు దాడి చేసినప్పుడు స్థానికులు దాడి చేశారు. దాడి చేసిన వారిలో కొందరు మహిళలు ఉన్నారు.
Bengal ED Case Viral
షాజహాన్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులపై కేసు నమోదు చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండానే ఈడీ(ED) అధికారులు తమ ఇంట్లోకి ప్రవేశించారని వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈడీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్థానికుల దాడిలో ముగ్గురు ఈడీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సోదాల కోసం వెళ్లినప్పుడు షాజహాన్ షేక్ తన ఇంటి వద్దే ఉన్నాడని ఈడీ అధికారులు తెలిపారు. ఫోన్ లొకేషన్‌ను బట్టి కూడా ఇది స్పష్టంగా చూపించారు. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలతో వెళ్లినా కూడా ఈడీ సిబ్బందిపై దాడి కలకలం రేపింది. షాజహాన్ షేక్ మద్దతుదారులు ED అధికారులపై దాడి చేసి వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు వాలెట్లను దోచుకున్నట్టు సమాచారం.
Also Read : Ayodhya Security : అయోధ్యలో భారీ భద్రతా బలగాల మోహరింపు