YSRCP vs TDP : వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ అంటూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదుల రగడ

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఏపీ రాజకీయాలు

YSRCP vs TDP : టీడీపీకి మద్దతు తెలిపిన నలుగురు ఎమ్మెల్యేలపై వైఎస్సార్‌సీపీ ఇటీవల స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ కూడా రివర్స కౌంటర్ ఇచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో విజయం సాధించి. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఎమ్మెల్యే, టీడీఎల్పీ విప్‌ డోలా బాలవేరాంజనేయస్వామి కోరారు.

YSRCP vs TDP Issues Viral

ఈ విషయమై ఎమ్మెల్యే స్వామి శాసనసభ కార్యదర్శికి అనర్హత పిటిషన్‌ను పంపారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ (దక్షిణ) ఎమ్మెల్యే వాసుపాలి గణేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు (పశ్చిమ) ఎమ్మెల్యే మద్దాళి గిరిపై రాజ్యాంగబద్ధంగా, న్యాయ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై స్పందించిన టీడీపీ కూడా ఫిర్యాదు చేయడం విశేషం.

వైఎస్సార్‌సీపీకి(YSRCP) చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గరయ్యారు. గతేడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసినందుకు నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మల్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కావున టీడీపీకి మద్దతు తెలిపిన నలుగురిపైన వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. అయితే వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చే తమ పార్టీలోని నలుగురు సభ్యులపై అనర్హత వేటు వేయాలని టీడీపీ కూడా కోరుతోంది.దింతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠరేపుతోంది.

Also Read : Nitin Gadkari : చక్కర మిల్లు యజమానులకు అండగా ఉంటామన్న నితిన్ గడ్కరీ

Leave A Reply

Your Email Id will not be published!