Bhogi 2024 Updates : భోగి రోజున పిల్లలకు రేగిపళ్ళను భోగి పళ్ళు గా ఎందుకు పోస్తారు..?
తెలుగు ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో హడావిడి
Bhogi 2024 Updates : తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి క్రేజ్ మొదలైంది. ఈ మూడు రోజులు ప్రతి ఇళ్లు సంబరాలతో మారుమోగుతోంది. భోగి పండుగ మొదటి రోజు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు, భోగి పళ్ళు. చిన్న పిల్లలను చక్కగా రెడీ చేసి నెత్తిపై భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి రోజున రేగిపళ్ళను భోగి పళ్ళుగా అందరు చిన్న పిల్లలకు వేస్తారు. అయితే భోగి రోజున చిన్న పిల్లలకు రేగు పండ్లను వేయడం ఏమిటి? ఈ రోజు మనం దీనికి సంబంధించిన ఆధ్యాత్మిక కారణాలను మరియు శాస్త్రీయ అంశాలను గురించి తెలుసుకుందాం.
Bhogi 2024 Updates Viral
ఇంట్లో 5 ఏళ్లలోపు చిన్న పిల్లలుంటే వాళ్ళ ఇంట్లో సాయంత్రం బోగీ సందడి. ఇంటి ఇరుగుపొరుగు వారి స్నేహితులను ఆహ్వానించి చిన్న పిల్లలకు బోగి పళ్ళు పోస్తారు. ఈ సమయంలో, చిన్న పిల్లలను నిజమైన శ్రీమన్నారాయణులుగా భావిస్తారు. ఎందుకంటే రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. బదరీఫలం అంటే శ్రీ మహా విష్ణువు. రేగిపళ్ళతో పాటు చామంతి, బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు కలిపి భోగి(Bhogi) పళ్ళుగా రెడీ చేస్తారు. ఆ తర్వాత దాన్ని పిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పి, పిల్లల తలపై పోసి అక్షతలతో దీవిస్తారు.
దీని ద్వారా బిడ్డలను విష్ణుమూర్తి అనుగ్రహిస్తారని వారి నమ్మకం. తల పైభాగంలో బ్రహ్మరంధ్రము ద్వారా స్వామి జ్ఞానం ప్రసాదిస్తారని పెద్దల నమ్మకం.
ఈ రేగు పండ్లు సంక్రాంతికి దొరుకుతాయి మరియు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా, వాటిలో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ భోగి పళ్లను పోస్తారు. ప్రస్తుతం పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అదనంగా, ఊపిరితిత్తులు మరియు జీర్ణవ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల, ఈ వయస్సు పిల్లలకు భోగి(Bhogi) పళ్ళను ఔషధంగా భావిస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జీర్ణ సమస్యలు మరియు ఉదర అసౌకర్యం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
బంతి పువ్వు రెక్కలు క్రిమి సంహారన, చర్మ సంరక్షణ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు ఈ పువ్వుల్లో ఉన్నాయి. మన పెద్దలు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ భోగిపళ్ళు పొసే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టి ఉండవచ్చు.
Also Read : AP & TS Reservations : ఏపీ తెలంగాణలో ఒక పక్క ఎన్నికల జోరు.. మరోపక్క రేజర్వేషన్ల పోరు