CM Jagan Launches Cell Towers: గిరిజన ప్రాంతాల్లో 300 కొత్త సెల్‌ టవర్లను ప్రారంభించిన సీఎం జగన్‌ !

గిరిజన ప్రాంతాల్లో 300 కొత్త సెల్‌ టవర్లను ప్రారంభించిన సీఎం జగన్‌ !

CM Jagan Launches: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ గా 300 సెల్‌ టవర్లను గురువారం ప్రారంభించారు. వీటిలో 136 ఎయిర్‌టెల్‌, 164 జియో ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్‌ ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్(CM Jagan) మాట్లాడుతూ… మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఈ సెల్ టవర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ రోజు 300 టవర్లు, జూన్‌ లో 100 టవర్లు ఏర్పాటు చేసాము.

సుమారు 400 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రంలో మొత్తం 3,119 కోట్ల రూపాయల ఖర్చుతో 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్‌ (ఐటీశాఖ) డైరెక్టర్‌ సి చంద్రశేఖర్‌ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్‌ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.

CM Jagan Launches Cell Towers

‘‘టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగింది. 5,549 గ్రామాలకు పూర్తి మొబైల్‌ టెలికాం సేవలు అందుతాయి. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయి. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుంది. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌, ఇంగ్లిషు మీడియం స్కూల్స్‌ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయి’’ అని సీఎం తెలిపారు.

Also Read : YS Sharmila Strong Counter to CM Jagan: సీఎం జగన్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్ !

Leave A Reply

Your Email Id will not be published!