YS Jagan: ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ !

ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ !

YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి మండలం సంగివలస వేదికగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘యుద్ధం’ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్… ఎన్నికలకు మరో 75 రోజులు మాత్రమే ఉన్నాయని… వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు కౌరవులు, పాండవులకు మధ్య జరుగుతున్న యుద్ధం లాంటిదని దానికి వైసీపీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. వైసీపీ పార్టీను పాండవులతో పోల్చిన సీఎం జగన్(YS Jagan)… ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపి, కాంగ్రెస్ లు కౌరవులతో పోల్చారు. జగన్ అనే వ్యక్తిని ఓడించడానికి… కౌరవుల మాదిరీగా ప్రతిపక్షాలు వాటి అనుబంధ మీడియా ఏకమై పద్మవ్యూహాన్ని పన్నుతున్నారని ఆరోపించారు. అయితే ఈ కౌరవుల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి తాను అభిమన్యుడ్ని కాదని… వారి అంతుచూసే అర్జునుడినని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలిచే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

YS Jagan Elections Campaign

భీమిలి మండలం సంగివలస వేదికగా నిర్వహించిన ‘యుద్ధం’ బహిరంగ సభకు ఉత్తరాంధ్రా జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి లక్షలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గృహసారధులు పాల్గొన్నారు. నభూతో నభవిష్యత్ అనే విధంగా జాతీయ రహదారికి ఆనుకుని నిర్వహించిన ఈ సభతో లో ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్(YS Jagan) పూరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్(YS Jagan) మాట్లాడుతూ… ‘‘గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం.

ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం . నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం. స్థానిక సంస్థల పదవులు ఆన్నింటిలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా మీ ఖాతాలో వేశాం

‘‘వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా ఈ సారి టీడీపీకి రావు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే… మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు’’ అని సీఎం పేర్కొన్నారు.
Also Read : Kerala Governor: కేరళ గవర్నర్‌ ధర్నా !

Leave A Reply

Your Email Id will not be published!