YS Sharmila Letter to Modi: ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ !

ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ !

YS Sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న షర్మిల… తనదైన శైలిలో అధికార వైసీపీను, ప్రతిపక్ష టీడీపీలతో పాటు బీజేపీ, జనసేనలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ లో చేరినట్లు ఆమె ప్రకటించిన నాటి నుండి… రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సోదరి అయినప్పటికీ… మీడియా, సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడుతున్నారు. వైఎస్సార్ బిడ్డ అని మరచి అవినీతి, స్వార్ధ రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు.

అయితే వైసీపీ నాయకులకు ధీటుగా సమాధానాలు ఇస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల(YS Sharmila)… ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకు మంగళవారం లేఖ రాసారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని ఆ లేఖలో అంవాల వారీగా వివరించారు. ప్రస్తుతం షర్మిల రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

YS Sharmila – షర్మిల లేఖలో ఏముందంటే ?

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీను ఉద్దేశ్యించి షర్మిల(YS Sharmila) ఈ విధంగా లేఖ రాసింది. “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై మీ దృష్టికి తీసుకువస్తున్నాను. విభజన జరిగిన ఒక దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఎన్నికల వాగ్దానాలను అమలు పరచలేదని వివరించారు. పదేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారనేది వాస్తవమని చెప్పారు. నేడు, రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానని ఆనాటి ప్రధాని చెప్పారని… ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఉందన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పూర్తిగా విస్మరించిందన్నారు.

పర్యవసానంగా నేడు, AP పురోగతి, అభివృద్ధి లేకుండా పోయిందని లేఖలో వివరించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు జాతీయ హోదాను నీరుగార్చాయని మండిపడ్డారు. పోలవరం రాష్ట్ర ప్రజల హక్కు అని… ఈ రోజు ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఈ అంశాలను 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాము విజ్ఞప్తిని చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేశారు.

Also Read : AP Konaseema News : వాళ్ళ ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన కలెక్టర్ కు గ్రామస్తుల ప్రశంసలు

Leave A Reply

Your Email Id will not be published!