Pawan Kalyan: పార్టీ నిధికి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ !

పార్టీ నిధికి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: పార్టీ కోసం పనిచేసే నాయకులకు సముచిత స్థానం కల్పించేలా బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, పార్టీ బలోపేతం కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని… వ్యక్తిగత ప్రయోజనాలకోసం కాదని ఆయన స్పష్టం చేసారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని… జనసేన-టీడీపీ కూటమి అధికారంలోనికి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఆదివారం రాత్రి విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan)… నేరుగా అనకాపల్లి వెళ్ళి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి… దాదాపు గంటసేపు పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్… సోమవారం విశాఖ జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులును ఉద్దేశ్యించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

Pawan Kalyan Announced

ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తరువాత రెండు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవి ఇప్పించాను. అయినప్పటికీ ఆయన జనసేన పార్టీలో చేరలేదు. కాబట్టి పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు సముచిత స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు వచ్చే టిక్కెట్ల కన్నా… భవిష్యత్తులో మరిన్ని పదవులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణకోసం… తాను స్వార్జితంగా సంపాదించిన రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు.

Also Read : BRS BJP Alliance: తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల పొత్తు ఫైట్ ?

Leave A Reply

Your Email Id will not be published!