Rajya Sabha Election: ఏకగ్రీవంగా తెలంగాణా రాజ్యసభ ఎంపీలు !
ఏకగ్రీవంగా తెలంగాణా రాజ్యసభ ఎంపీలు !
Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగియడంతో… తెలంగాణాలో ఇద్దరు కాంగ్రెస్, ఒకరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రంలో 3 రాజ్యసభ(Rajya Sabha) స్థానాలకు గాను ముగ్గురు మాత్రమే బరిలో మిగలడంతో… నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుండి వద్దిరాజు రవిచంద్ర, శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్‌లు నామినేషన్లు వేసారు.
Rajya Sabha Election Update
అయితే రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, భారాస అభ్యర్థులు మినహా… మిగిలిన ముగ్గురికి మద్దతుగా ఎమ్మెల్యేలెవరూ సంతకాలు చేయలేదు. దీనితో వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి తిరస్కరించారు. దీనితో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం ఇద్దరు కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిట్నరింగ్ అధికారి ప్రకటించనున్నారు.
Also Read : Chandigarh Mayor Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు !